![]() |
![]() |
.webp)
సూపర్ సింగర్ షో ఎట్టకేలకు గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఈ షోలో సిక్స్ కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఐతే టైటిల్ ఎవరిదీ అనేది ఇప్పుడు అంతా చర్చ జరుగుతోంది. అలంటి టైంలో జడ్జ్ రాహుల్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ చెప్పాడు. "పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా కానీ నాకు ఎవరూ పిల్లనివ్వడం లేదు. పెళ్లనేది ఎప్పుడు జరగాలి అని ఉంటే అప్పుడే జరుగుతుంది. ప్రస్తుతం నేను నా కెరీర్ మీద ఫోకస్ చేసాను. చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో ప్రెజెంట్ కాన్సంట్రేషన్ దాని మీదనే ఉంది. అలాగే ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ కి గామా అవార్డు కూడా వచ్చింది. చాలా సంతోషంగా ఉంది.
రెండు మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో రెండు రోల్స్ చేస్తున్నాను. ఐతే పెద్ద ప్రాజెక్ట్స్ లో కొన్ని సాంగ్స్ పాడి ఉన్నా..కానీ రిలీజ్ వరకు నాకు నా వాయిస్ ఉంటుందా ఉండదో తెలీదు.. అందుకే చెప్పలేను ఇప్పుడే. నేను ఇప్పుడు సూపర్ సింగర్ షో చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది నేను కూడా ఒకప్పుడు స్టార్ మా సూపర్ సింగర్ లో కంటెస్టెంట్ అయ్యి ఉంటే బాగుండేది అని ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న ప్లే బ్యాక్ సింగర్స్ అంతా సూపర్ సింగర్ షో నుంచి వెళ్లిన వాళ్ళే. కంటెస్టెంట్ కాకపోయినా జడ్జి అయ్యాను. అదే హ్యాపీగా ఉంది. అవకాశం ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు. ఐతే కంటెస్టెంట్స్ కి ఎలా పాడాలో చెప్పలేను కానీ ఎలా పాడకూడదో కొన్ని కరెక్షన్స్ ని నాకున్న నాలెడ్జి ప్రకారం చెప్పగలను. నేను మంగ్లీ మంచి ఫ్రెండ్స్..షోలో నలుగురం ఉంటాం కాబట్టి ఎక్కడా బోర్ కొట్టకుండా కాసేపు టీజ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అంతే కానీ వేరే కాదు. అనంత శ్రీరామ్ మాట్లాడే మాటలు చాలా నచ్చుతాయి. నేను సుజాత మోహన్ గారికి మంచి ఫ్యాన్ ని.. శ్వేతా మోహన్ గారి దగ్గర నుంచి డైనమిక్స్ ని ఎలా పాడాలో తెలుసుకుంటూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మంగ్లీ దగ్గర నుంచి ఆటిట్యూడ్ ఎలా మెయింటైన్ చేయాలో, ఫోక్ ఎలా పాడాలో తెలుసుకుంటూ ఉంటాను. శ్రీముఖి హోస్టింగ్ అద్భుతంగా చేస్తుంది. చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. వెళ్లందరినుంచి నేను ఎంతో కొంత నేర్చుకున్నాను ఈ షో ద్వారా " అని చెప్పాడు సూపర్ సింగర్ జడ్జ్ రాహుల్ చిచ్చా.
![]() |
![]() |